దుబాయ్ నుండి అబుదాబికి 25 నిమిషాల్లో చేరుకోవచ్చా?
- May 19, 2025
యూఏఈ: వచ్చే ఏడాది నుండి యూఏఈ వాసులు ఎతిహాద్ రైలులో ప్రయాణించవచ్చు. ఇటీవల అబుదాబి నుండి ఫుజైరాకు రైలులో ప్రయాణించిన మార్కెటర్, జాతీయ నిపుణుల ప్రోగ్రామ్ సభ్యురాలు సారా లుక్మాన్.. అబుదాబి నుండి దుబాయ్‌కు తన ప్రయాణానికి కేవలం 25 నిమిషాలు పట్టిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. సాధారణంగా ఈ ప్రయాణానికి దాదాపు 90 నిమిషాలు పడుతుంది. నేషనల్ ఎక్స్‌పర్ట్స్ ప్రోగ్రామ్ (NEP) ఐదవ మాడ్యూల్‌లో పాల్గొనడానికి అబుదాబి నుండి ఫుజైరాకు ప్రయాణించిన బృందంలో సారా ఒకరు.
స్పీడ్ స్క్రీన్, సౌకర్యవంతమైన సీట్లు
సారా పోస్ట్ చేసిన వీడియో రైలులో ప్రయాణం ఎలా ఉంటుందో చూపించింది. లేత బూడిద రంగుతో సౌకర్యవంతమైన సీట్లు నాలుగు వరుసల్లో ఉన్నాయి. బ్యాగులను పెట్టడానికి సీట్ల పైన లగేజ్ రాక్‌లు ఉన్నాయి. ఒక ప్యాసింజర్ రైలులో దాదాపు 400 మంది వ్యక్తులు కూర్చునే సదుపాయం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో బిజినెస్, ఎకానమీ క్లాస్ కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. రైలు లోపల ఒక స్క్రీన్ ప్రయాణ మార్గాన్ని చూపెడుతుంది. అలాగే ఆహ్లదకరమైన ప్రదేశాల గుండా రైలువెళుతుందని, అవన్నీ ప్రకృతి రమణీయతను అందిస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







