మే నెలలో పెరిగిన పెట్రోల్ ధరలు జూన్‌లో తగ్గుతాయా?
- May 27, 2025
యూఏఈ: ఈ నెలాఖరులో ప్రకటించే జూన్ నెలకు సంబంధించి పెట్రోల్ ధరలలో స్వల్ప తగ్గింపు కనిపించవచ్చు. మే లో బ్రెంట్ చమురు ఎక్కువగా బ్యారెల్‌కు $60 దరిదాపుల్లో ట్రేడవుతోంది. ఇది గత నెల కంటే కొంచెం తక్కువ. తాజాగా WTI ముడి చమురు, బ్రెంట్ వరుసగా బ్యారెల్‌కు $61.44 మరియు $64.68 వద్ద స్వల్పంగా తగ్గాయి.
మే నెలలో లీటరుకు కేవలం ఒక ఫిల్సు చొప్పున ధరలను పెరిగాయి. సూపర్ 98, స్పెషల్ 95 మరియు E-ప్లస్ 91 ధరలను వరుసగా లీటరుకు Dh2.58, Dh2.47 మరియు Dh2.39గా నిర్ణయించారు. యూఏఈ లో 2015లో ఇంధన ధరలపై నియంత్రణ తొలగించినప్పటి నుండి ప్రతి నెలాఖరులో పెట్రోల్ ధరలను సవరిస్తున్నారు.
జూన్ నెలలో బ్రెంట్ సగటు ముగింపు ధర బ్యారెల్‌కు $63.6గా ఉంది. గత నెలల బ్యారెల్‌కు $66.6గా ఉంది. అయితే, జూన్ నెలకు కొత్త ధరల గురించి అధికారిక ప్రకటన ఈ నెలాఖరులో వెలువడుతుంది. ఇంధన ఉత్పత్తి సంస్థ ఒపెక్+ ఈ వారం జరిగే సమావేశంలో ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉన్నందున చమురు ధరలు మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
"ఈ సంవత్సరం ముడి చమురు బాగా తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలు ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయి. డిమాండ్ నేపథ్యంలో ఒపెక్ + మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి ఉత్పత్తిని వేగవంతం చేయవచ్చు. చమురు ఈ సంవత్సరం $74.93 దగ్గర ప్రారంభమైంది. జనవరి మధ్య నాటికి $82.63కి పెరిగింది, కానీ ఏప్రిల్ 9 నాటికి $58.40కి పడిపోయింది. ఆ తర్వాత స్వల్పంగా తిరిగి వచ్చింది, మే చివరి నాటికి ధరలు దాదాపు $65కి పెరిగాయి. కానీ అది ఇప్పటికీ చమురు దాని ప్రారంభ సంవత్సరం గరిష్ట స్థాయి కంటే దాదాపు 20 శాతం తక్కువగా ఉంది. ”అని సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ విజయ్ వాలెచా అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







