షార్జాలో ఫైర్..12 గంటలపాటు కష్టపడ్డ ఫైర్ ఫైటర్స్..!!

- June 01, 2025 , by Maagulf
షార్జాలో ఫైర్..12 గంటలపాటు కష్టపడ్డ ఫైర్ ఫైటర్స్..!!

యూఏఈ: శనివారం రాత్రి హమ్రియా ఓడరేవులో ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నిల్వ ఉంచిన అత్యంత మండే పదార్థాలు మంటల్లో చిక్కుకున్నాయి. దాంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఫైర్ ఫైటర్స్ వాటిని అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 12గంటలపాటు శ్రమించినట్లు మంటలను నిరోధించగలిగారని షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ అబ్దుల్లా ముబారక్ బిన్ అమెర్ తెలిపారు.ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదన్నారు. ప్రత్యేక బృందాలు అధునాతన పరికరాలను ఉపయోగిస్తున్నాయని, అత్యవసర ప్రోటోకాల్‌ల ప్రకారం పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.

మే 25న షార్జాలోని అల్ సాజా ప్రాంతంలోని పెట్రోకెమికల్, ఫైబర్‌గ్లాస్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.అదే రోజు అబుదాబిలోని ముస్సాఫ్ఫా పారిశ్రామిక ప్రాంతంలోని ఒక గిడ్డంగిలో మరొక అగ్నిప్రమాదం సంభవించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com