'కుబేర' నుంచి సెకండ్ సింగిల్ అనగనగ కథ రిలీజ్

- June 03, 2025 , by Maagulf
\'కుబేర\' నుంచి సెకండ్ సింగిల్ అనగనగ కథ రిలీజ్

ధనుష్-నాగార్జున హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా 'కుబేర' టీం దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ అనగనగ కథ సినిమా పవర్ ఫుల్ మోరల్ కోర్ కి పర్ఫెక్ట్ మ్యూజిక్ ప్రజెంటేషన్ ని అందిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలని పెంచుతూ కొత్త సాంగ్ సినిమా సారాంశాన్ని తెలియజేస్తోంది. ఇది దురాశ, అవినీతి మధ్యలో చిక్కుకున్న దుర్బలమైన మానవత్వం ఇతివృత్తాలతో డీప్ గా కనెక్ట్ అయ్యే సాంగ్.  

చార్ట్‌బస్టర్ మాస్ నంబర్‌లకు పేరుగాంచిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ అనగనగ కథ ని మనసుని కదిలించే ట్రాక్ గా కంపోజ్ చేశారు.  గేయ రచయిత చంద్రబోస్ ఆర్థిక అసమతుల్యత, డబ్బు అవినీతి ప్రభావం వంటి సమస్యలను పరిష్కరించడానికి లోతైన పదాలతో అందించిన సాహిత్యం అద్భుతంగా వుంది. ఈ పాట నైతిక దిక్సూచిగా, ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతోంది. హైదే కార్తీ, కరీముల్లా వోకల్స్ ట్రాక్‌ కు మరింత ఎనర్జీ నింపాయి.

ధనుష్, నాగార్జున డిఫరెంట్ అవతార్స్ లో కనిపించడం ఆకట్టుకుంది. వారి ఎక్స్ ప్రెషన్స్ డిఫరెంట్ ఐడియాలజీని ప్రజెంట్ చేస్తున్నాయి. సంపద, హోదాపై వ్యామోహంతో ఉన్న సమాజం ఒత్తిళ్ల ద్వారా రూపొందించబడిన కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ని సూచించే స్నిప్పెట్‌లలో వారి పెర్ఫార్మెన్స్ ఎమోషనల్ గా వుంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, జిమ్ సర్బ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP,అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలోకి వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com