ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ..ఫైనల్లో పంజాబ్ పై ఘన విజయం
- June 04, 2025
అహ్మదాబాద్: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది.ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. ఫలితంగా 6 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్ అనేక మలుపులు తిరిగింది. ఒకసారి ఆర్సీబీ, మరొకసారి పంజాబ్ రేసులోకి వచ్చాయి. చివరికి విజయం ఆర్సీబీనే వరించింది.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫైనల్ లో విఫలం అయ్యాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. చివరలో శశాంక్ హాఫ్ సెంచరీతో చెలరేగినా.. ఫలితం లేకపోయింది. పంజాబ్ కి ఓటమి తప్పలేదు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. పంజాబ్ తో హోరాహోరీ పోరులో విజయం సాధించి సుదీర్ఘ ఐపీఎల్ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. 18వ సీజన్ లో ఎట్టకేలకు తమ తొలి ఐపీఎల్ టైటిల్ ని అందుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి టైటిల్ కోసం అలుపెరగని పోరాటం చేసింది ఆర్సీబీ. చివరికి లక్ష్యాన్ని సాధించింది. ఫైనల్ లో సమష్టి ప్రదర్శనతో విక్టరీ కొట్టి.. 17 సీజన్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీని 18వ ప్రయత్నంలో సొంతం చేసుకుంది. మూడుసార్లు ఆఖరి మెట్టుమీద తడబడిన ఆర్సీబీ.. ఎట్టకేలకు తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.
తొలత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఆర్సీబీలో టాప్ స్కోరర్ అతడే. రజత్ పటీదార్ (16 బంతుల్లో 26), లియామ్ లివింగ్‌స్టోన్ (15 బంతుల్లో 25) మెరుపులు మెరిపించారు. చివర్లో మయాంక్ అగర్వాల్ (24), జితేష్ శర్మ (24) కూడా విలువైన పరుగులు జోడించడంతో ఆర్సీబీ ఫైటింగ్ స్కోర్ ను సాధించింది.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







