ఎయిమ్స్ అభివృద్ధి పై ఢిల్లీలో కేంద్ర వైద్య శాఖ అధికారులతో భేటీ అయిన ఎంపీ బాలశౌరి
- June 12, 2025
న్యూ ఢిల్లీ: మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధి కోసం ఈరోజు ఢిల్లీ లో కేంద్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ కుమారి పుణ్య శ్రివాత్సవ మరియు జాయింట్ సెక్రటరీ కుమారి అంకితా మిశ్రా బుందేలాతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.మంగళగిరి ఎయిమ్స్ వారు 25 లక్షల మంది పేషెంట్ లకు వైద్య సేవలు అందించడం అనే మైలురాయిని దాటడం గర్వకారణం అని, భవిష్యత్తులో కూడా మరింత మంది రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించి రాష్ట్రంలోనే ఒక మంచి హాస్పిటల్ గా మంగళగిరి ఎయిమ్స్ పేరు తెచ్చుకోవాలని తెలపడం జరిగింది.
మంగళగిరి ఎయిమ్స్ జాతీయ రహదారి ప్రక్కనే ఉన్నందున, రహదారులలో ఎటువంటి రోడ్డు ప్రమాదం జరిగినా, వెంటనే అవసరమైన వైద్య సేవలు అందించడానికి గాను ఒక ప్రత్యెక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయవలసినదిగా, రోజు రోజుకి హాస్పిటల్ కి వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నందున, అదే స్థాయిలో డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది కొరతలేకుండా చూడాలని, కాన్సర్ భాదితులను ఆదుకోవడానికి ఒక కాన్సర్ కేర్ సెంటర్ ను, కోవిడ్-19 సమయంలో ఎలాగైతే తాత్కాలిక క్రిటికల్ కేర్ బ్లాక్ ను ఏర్పాటుచేసి బాధితులకు వైద్య సేవలు అందించామో అదేవిధంగా పెర్మనెంట్ గా ఒక క్రిటికల్ కేర్ విభాగం మంగళగిరి ఎయిమ్స్ లో ఏర్పాటుచేయాలనీ కోరడం జరిగింది.
ప్రతివ్యక్తి అతితక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు మంగళగిరి ఎయిమ్స్ లో మాత్రమే పొందగలుగుతాడని, ప్రతి వ్యక్తి మాస్టర్ హెల్త్ చెక్ అప్ చేయించుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటుచేయాలని, ఒక ఢిల్లీ ఎయిమ్స్ లాగా మనకు కూడా మంగళగిరి ఎయిమ్స్ ఉంది అని ఇక్కడి ప్రజలు అనుకునే విధంగా చర్యలు చేపట్టాలని వారిని కోరడం జరిగింది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి