UKలో విక్రయించే కొన్ని దుబాయ్ చాక్లెట్లలో నిషేధిత పదార్థాలు..!!
- June 13, 2025
యూఏఈ: UK రిటైల్ మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని దుబాయ్ స్టైల్ చాక్లెట్లు దేశ ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చని, వాటిల్లో నిషేధిత పదార్థాలు ఉండవచ్చు అని బ్రిటిష్ నియంత్రణ సంస్థ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ (FSA) తెలిపింది. అయితే, UKలో లభించే దుబాయ్ తరహా చాక్లెట్లలో ఎక్కువ భాగం బ్రిటిష్ వినియోగదారులకు తినడానికి "సురక్షితమైనవి" అని అథారిటీ పేర్కొంది. ఇతర దేశాల నుండి దుబాయ్ చాక్లెట్ బ్రాండ్ కింద దిగుమతి చేసుకున్న కొన్ని ఉత్పత్తులలో నిషేధిత పదార్థాలు ఉండవచ్చని వినియోగదారులకు సూచించింది.
దుబాయ్ చాక్లెట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. మరికొన్ని దేశాలలోని కంపెనీలు కూడా ఇలాంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నాయి. టిక్‌టాక్‌లో ప్రజాదరణ పొందిన ఈ చాక్లెట్ జర్మనీలో చాక్లెట్ బార్లను కొనడానికి గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ఈ చాక్లెట్ పిస్తాపప్పులు, క్రిస్పీ తురిమిన ఫిలో పేస్ట్రీతో నిండి ఉంటుంది. దీని ధర జర్మనీలో దాదాపు 25 యూరోలు.
ఈ సంవత్సరం ప్రారంభంలోజర్మన్ కోర్టు ఒక సూపర్ మార్కెట్‌ను "దుబాయ్ చాక్లెట్" అని పిలిచే ఉత్పత్తిని విక్రయించవద్దని కోరింది. అది ఎమిరేట్ నుండి ఉద్భవించినట్లయితే మాత్రమే దుబాయ్ బ్రాండ్‌తో గుర్తించాలని పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జర్మన్ అధికారులు హాంబర్గ్ విమానాశ్రయంలో ఒక మహిళ నుండి 90 కిలోల లగ్జరీ దుబాయ్ చాక్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







