భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్..!!
- June 13, 2025
మస్కట్: అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదం నేపథ్యంలో భారత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాప సందేశం పంపారు.ఈ వినాశకరమైన ప్రమాదంపై సుల్తాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన తన హృదయపూర్వక సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. రన్ వే పైనుంచి టేక్ ఆఫ్ అయిన 30 సెకన్లలోనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకొట్టి పేలిపోయింది.ఈ ప్రమాదంలో 240కిపైగా ప్రయాణికులు మరణించారు. మృతులలో పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







