ఆర్టీసిలో తొలి మహిళా డ్రైవర్ గా సరిత
- June 16, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తొలి మహిళా డ్రైవర్ బాధ్యతలు చేపట్టారు. తొలి మహిళా డ్రైవర్ ఒక గిరిజన మహిళ చేరారు. తొలి మహిళా డ్రైవర్ బాధ్యతలు చేపట్టిన సరితను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించగా, రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఆర్టీసిలో తొలి మహిళా డ్రైవర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్య తండా కు చెందిన వి సరిత మిర్యాలగూడ డిపోలో జెబిఎం సంస్థ నుండి ఆర్టీసి ఎలక్ట్రిక్ బస్సు మహిళా డ్రైవర్ గా విధుల్లో చేరారు. సరిత హైదరాబాద్ టూ మిర్యాలగూడ బస్సును నడుపుతున్నారు. గతంలో ఢిల్లీలో రవాణా సంస్థలో 10 సంవత్సరాలు డ్రైవర్ విధులు నిర్వహించారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకు స్వస్థలంలో డ్రైవర్‌గా అవకాశం ఇవ్వాలని ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన సరిత మంత్రికి విజప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టిసి అధికారులతో జెబిఎం సంస్థ ప్రతినిధులతో మాట్లాడి మిర్యాలగూడ డిపో నుండి నియమించారు. తనకు అవకాశం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కి మహిళా డ్రైవర్ సరిత ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని ఇప్పటికే మహాలక్ష్మీ పథకం ద్వారా ఆరిటిసిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు చేపట్టా మని.. తాజాగా ఆర్టీసిలో మహిళా డ్రైవర్‌గా అవకాశం ఇవ్వడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలు పురుషులతో సమా నంగా అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
వాంకుడోతు సరితకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఆర్టీసి బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగని పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు. గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, ఈ క్రమంలో సరిత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని సిఎం గుర్తుచేశారు. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
వేయాలని ఆర్ టిసిలో శాశ్వత డ్రైవర్‌గా ఉద్యోగం కల్పించాలి. తెలంగాణ ఆర్టీసిలో తొలి మహిళా డ్రైవర్ అయిన సరితకు ఆర్టీసిలో పర్మినెంట్ డ్రైవర్‌గా ఉద్యోగం కల్పించి ఆమెకు గౌరవం కల్పించేలా చూడాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కి, ఆర్టిసి మేనేజంగ్ డైరెక్టర్ సజ్జ నార్కు స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్ డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. డ్రైవర్ సరితను ఆర్టీసిలో నియమించకుండా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ అయిన జెబిఎం సంస్థలో, అది కూడా మంత్రి సహకారంతో తాత్కా లిక ఉద్యోగం కల్పించి ఆమెకు సరైన గౌరవం కల్పించక పోవడం, పైగా జెబిఎం సంస్థలో ఉద్యోగం ఇప్పించడమే గొప్పపని అన్నట్లు పత్రికలకు ప్రక టన విడుదల చేయడం అత్యంత బాధాకరమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావ్ అన్నారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









