ఖోర్ఫక్కన్ ఫెస్టివల్..సందడి చేస్తున్న పలు రకాల మామిడి పండ్లు..!!

- June 28, 2025 , by Maagulf
ఖోర్ఫక్కన్ ఫెస్టివల్..సందడి చేస్తున్న పలు రకాల మామిడి పండ్లు..!!

యూఏఈ: ఖోర్ఫక్కన్ ఎక్స్‌పో సెంటర్ మామిడి పండ్ల ఫెస్టివల్ తో సందడి చేస్తుంది. 50 కంటే ఎక్కువ రకాల మామిడి పండ్లు ప్రదర్శనలో ఉన్నాయి. బాడియా, దిబ్బా, కల్బా ఫుజైరా, ఖోర్ఫక్కన్, మసాఫీ వంటి ప్రాంతాల నుండి రైతులు మామిడి పండ్లను తీసుకొచ్చారు. ధరలు పరిమాణం, రకాన్ని బట్టి కిలోగ్రాముకు Dh15 నుండి Dh70 వరకు ఉన్నాయి.

“మేము చాలా సంవత్సరాలుగా మామిడి పండ్లను పెంచుతున్నాము” అని బడియాకు చెందిన రైతు సయ్యద్ అబ్దుల్ అజీమ్ అన్నారు. “మా చెట్లు వేసవిలో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా ఫలాలను ఇస్తాయి. నా దగ్గర దాదాపు 100 మామిడి చెట్లు ఉన్నాయి.మేము ఎటువంటి రసాయనాలను ఉపయోగించము. ప్రతిదీ సేంద్రీయమైనది, అందుకే ప్రజలు తిరిగి వస్తూ ఉంటారు.” అని తెలిపారు.

ఈ ఫెస్టివల్.. రైతులు తమ పంటను నేరుగా అమ్ముకోవడానికి సహాయపడటమే కాకుండా స్థానిక ఉత్పత్తుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వారికి ఒక వేదికను కూడా అందజేస్తుంది. రైతులు చెట్లను ఎలా సంరక్షిస్తారో, వారు పెంచే రకాలు, సేంద్రీయ వ్యవసాయం వారి సంప్రదాయంలో ఎలా భాగమో తమ అనుభవాలను తెలిపే కేంద్రంగా సేవలు అందిస్తుందని నిర్వాహకులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com