గుండెపోటుతో నటి షఫాలీ జరివాలా మృతి
- June 28, 2025
ముంబై: ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా (42) కన్నుమూశారు.శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమె చనిపోయారు. ముంబైలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లే సరికి ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.షెఫాలీ మరణం సినీ పరిశ్రమను, ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 2000 సంవత్సరం మొదట్లో ‘కాంటా లగా’ అనే పాటతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అలా ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. ఆమెకు కాంటా లగా గర్ల్ అనే పేరు వచ్చేసింది. షెఫాలీ జరీవాలా ను ఆమె భర్త పరాగ్ త్యాగి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే షెఫాలీ చనిపోయిందని వైద్యులు తెలిపారు. షెఫాలీని ఆసుపత్రికి తీసుకువచ్చే ముందే ఆమె చనిపోయారు. ఆమె భర్త, మరికొందరు ఆమెతో ఉన్నారు అని హాస్పిటల్ టీం చెప్పింది. షెఫాలీ జరీవాలా మరణం చాలా మందికి షాక్‌ను కలిగించింది. ఇలా అకస్మాత్తుగా గుండె పోటు ఏంటి? మరణించడం ఏంటి? అని అంతా ఆశ్చర్యపోతోన్నారు.
అభిమానులు ముద్దుగా కాంటా లగా గర్ల్ అని కూడా పిలుస్తుంటారు
షెఫాలీ జరివాలా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె అహ్మదాబాద్‌లో జన్మించింది. 2002 సంవత్సరంలో ఆశా పరేఖ్ చిత్రంలోని కాంటా లగా పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ పాటను ముజ్సే షాదీ కరోగి చిత్రంలో ఉపయోగించారు. ఇప్పటికీ ఈ పాటకు యూట్యూబ్ లో అత్యధిక మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట హిట్ కావడంతో షెఫాలిని అభిమానులు ముద్దుగా కాంటా లగా గర్ల్ అని కూడా పిలుస్తుంటారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 13లోనూ షెఫాలి పాల్గొంది. అలాగే ముజ్సే షాదీ కరోగి సినిమా తర్వాత హిందీలో ఆమె మరో సినిమా చేయలేదు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







