తెలంగాణ యూనివర్శిటీల్లో ఉద్యోగాలు..
- June 28, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకంపై కీలక అప్‌డేట్ వచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు యూనివర్సిటీల్లోని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఈ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.వాటిలో ఉస్మానియా యూనివర్శిటీ (OU), కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు యూనివర్శిటీ, శాతవాహన యూనివర్శిటీ ఉన్నాయి. అదేవిదంగా మిగతా 8 యూనివర్శిటీల్లో కూడా నియామకాల ప్రక్రియను కొనసాగించే దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఐతే.. ఇందులో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు సిబ్బందిని మినహాయించి మిగిలిన ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నారు.
నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 4న విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. కానీ, 2 నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ మొదలుకాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 74 శాతం టీచింగ్ సిబ్బంది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ఉద్యోగాల నియామకం కోసం పాలకమండళ్ల ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల సెక్రటేరియట్‌లో కాకతీయ, శాతవాహన, ఓయూ, పాలమూరు యూనివర్శిటీల పాలకమండళ్ల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మొనహాయించి మిగతా ఖాళీల భర్తీకి ఆమోదం లభించింది. ఈ పోస్టులపై రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను రూపొందించి, నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మరో 3 నెలల సమయం పెట్టె ఎవకాశం ఉంది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్‌డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా