'కొత్తపల్లిలో ఒకప్పుడు' విలేజ్ ప్లే ఫుల్ రైడ్ టీజర్ రిలీజ్
- July 04, 2025
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, మీనింగ్ ఫుల్ ఎంటర్ టైనింగ్ సినిమాలకి సపోర్ట్ ని కంటిన్యూ చేస్తోంది. ఈసారి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తోంది. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా చూపించబోతోంది.
గాసిప్‌తో సందడి చేసే పల్లెటూరి నేపథ్యంలో సాగే కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ కలలు, విలేజ్ డ్రామా ఒకదానితో ఒకటి కలిసిపోయే వరల్డ్ పరిచయం చేస్తుంది. మనోజ్ చంద్ర రికార్డ్ డ్యాన్స్ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా కనిపించాడు. అతను డ్యాన్స్ పార్ట్నర్ కోసం వెదుకుతున్నప్పుడు ఊహించని సమస్యలలో చిక్కుకుంటాడు.
కొత్తపల్లిలో ఒకప్పుడు రిఫ్రెష్‌గా ఉండే రస్టిక్ టోన్ లో ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ పెట్రోస్ ఆంటోనియాడిస్, గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా చూపించాడు. మణిశర్మ సంగీతం సమకూర్చగా, వరుణ్ ఉన్ని అందించిన నేపథ్య సంగీతం టీజర్ ఫన్ ని ఎలివేట్ చేసింది.
ఈ చిత్రంలో మోనికా టి, ఉషా బోనెల కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. టీజర్లో పెర్ఫార్మెన్స్ లో చాలా నేచురల్ గా ఆకట్టుకున్నాయి.
గురుకిరణ్ బత్తుల కథ, సంభాషణలను అందించారు. డైరెక్టర్ ప్రవీణ పరుచూరి నెరేటివ్ కి చక్కని సున్నితత్వాన్ని తీసుకువచ్చారు.
టీజర్ అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రం జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల, రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: రానా దగ్గుబాటి
దర్శకత్వం: ప్రవీణ పరుచూరి
పాటలు: మణి శర్మ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: వరుణ్ ఉన్ని
నిర్మాణ సంస్థ: పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్
నిర్మాతలు: గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆలూర్ నిరంజన్
డీవోపీ: పెట్రోస్ ఆంటోనియాడిస్
ఆడిషినల్ సినిమాటోగ్రఫీ: సందీప్ కె విజయ్
ఎడిటర్, క్రియేటివ్ డైరెక్టర్: కిరణ్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్లు: జితేంద్ర మౌర్య, విశాల్ జ్ఞానచందని
కథ, మాటలు: గురుకిరణ్ బత్తుల
కొరియోగ్రఫీ: మెహర్ బాబా
స్టంట్స్: 'మార్వెల్' నటరాజ్
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ క్యాంపైన్: అనిల్ & భాను
మార్కెటింగ్ పార్ట్నర్: స్పిరిట్ మీడియా
డిజిటల్ మార్కెటింగ్: సౌత్‌బే
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









