షువైక్ వుడ్ డిపోలో ఫైర్ యాక్సిడెంట్..తప్పిన ప్రాణాపాయం..!!

- July 08, 2025 , by Maagulf
షువైక్ వుడ్ డిపోలో ఫైర్ యాక్సిడెంట్..తప్పిన ప్రాణాపాయం..!!

కువైట్: షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం జరిగింది. వుడ్, ఇన్సులేటింగ్ పదార్థాలను నిల్వ చేస్తున్న గిడ్డంగిలో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రకారం.. పైర్ యాక్సిడెంట్ సమాచారం అందగానే షువైక్ ఇండస్ట్రియల్ సెంటర్స్, అల్-షహీద్ మరియు అల్-ఎస్నాద్ నుండి అగ్నిమాపక బృందాలు తరలివెళ్లాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని, సకాలంలో మంటలను అదుపులోకి తీసుకురావడంలో బృందాలు విజయం సాధించాయని, ప్రాణాపాయం తప్పిందని ఫైర్ ఫోర్స్ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com