పుష్కర గోదావరి
- July 14, 2015
సింహరాశిలో గురుడు సంచరించిన వేళ
పుణ్య నదిలో పుష్కరుండు జేర
గల గలా పారేటి గోదావరీ నదికి
పుష్కరాలు వచ్చి పొంగి పొరలె
దివిలోని దేవతలు బ్రహ్మ దేవుని వెంట
భువిలోకి ఋషులతో బయలు దేరి
గోదావరీ నదిలో స్నాన మాడుతు మనకు
పుష్కరాల మహిమ తెలియ బరిచె
పుష్కరాల నీట స్నాన మాడిన జాలు
జన్మ జన్మల పాప కర్మలన్ని
కడిగి వేసిన పుణ్య ఫలము దక్కు నంటు
జన సంతతికి ముక్తి దారి జూపె
మహాదేవ వరముతో మహారాష్ట్రలో పుట్టి
పలు రాష్ట్రముల వర ప్రదాయినయ్యి
సిరుల పంటలు చాల దారి పొడుగున పంచి
దక్షిణాదిన పుణ్య గంగ అయ్యె
. . . నక్క భాస్కర రావు
అబుధాబి
తేదీ : 14-07-2015
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







