స్వీట్ కార్న్ మంచూరియా
- July 15, 2015
స్వీట్ కార్న్ మంచూరియా
కావలిసిన పదార్ధాలు
బేబి కార్న్ - పదిహేను
అల్లం, వెల్లుల్లి తరుగు - సరిపడినంత(విడివిడిగా)
పచ్చిమిర్చి - మూడు
ఉల్లిపాయలు - మూడు
క్యాప్సికం - ఒకటి
సోయా సాస్ - ఒక స్పూను
వెనిగర్ - అర స్పూన్
కొత్తిమీర తరుగు - కొద్దిగా
మిరియాల పొడి - అర స్పూను
ఉప్పు - తగినంత
చక్కెర - అర స్పూను
నూనె - వేయించేందుకు సరిపడా
మైదా - మూడు స్పూన్లు
జొన్నపిండి - మూడు స్పూన్లు
తయారీ విధానం
మైదా, మొక్కజొన్న పిండిలోకి కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి ఒక గిన్నెలోకి తీసుకుని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. బేబీ కార్న్‌ని
ఈ మిశ్రమంలో ముంచి కాగే నూనెలో వేసి ఎర్రగా వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక బాణలిలో నూనె వేసి, దానిలో ఉల్లిముక్కలు, పచ్చి మిర్చ ముక్కలు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి, బాగా వేగాక క్యాప్సికం, సోయా సాస్ వేసి కలపాలి. తరువాత మిరియాలపొడీ, ఉప్పు, చక్కెర వేసి కలపాలి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మంట తగించాలి. సాస్ వేడెక్కాక వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసి పైన వెనిగర్ వేస్తే మంచూరియా రెడీ.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







