యంగ్ లీడ్ డైరెక్టర్-బాబీ
- August 01, 2025
తెలుగు తెర పై ఎందరో స్క్రీన్ రైటర్స్ దర్శకులుగా మారారు...వారిలో బాబీ ఒకరు. సినిమా మీదున్న ప్రేమే ఈ గుంటూరు చిన్నోడిని, భాగ్యనగరానికి రప్పించింది.సినిమాల్లో నిలదొక్కుకోవడానికి చేయాల్సిన పనులన్నీ చేసి..రైటింగ్ విభాగంలో కుదురుకున్న బాబీ... అక్కడి నుంచి మాస్ మహారాజా రవి తేజలోని పవర్ చూపించి ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.నేడు యుంగ్ లీడ్ డైరెక్టర్ బాబీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
బాబీ కొల్లి అలియాస్ కె.ఎస్ రవీంద్ర 1983, ఆగస్టు 1న గుంటూరులో జన్మించాడు.అక్కడే బీకామ్ పూర్తి చేసి సినిమా రంగమే లోకంగా బ్రతుకుతూ భాగ్యనగరానికి అడుగుపెట్టారు. స్క్రీన్ రైటర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన బాబీ దర్శకులైన దశరథ్, మలినేని గోపిచంద్ వద్ద కొద్దీ కాలం పనిచేసిన తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాతో డైరెక్టర్ గా మారాడు.ఆ సినిమా మంచి హిట్ అవడంతో బాబీకి తర్వాత డైరెక్టర్ గా వెనుకడుగేయాల్సిన అవసరం లేకుండా పోయింది. బాబీ దర్శకుడిగా మారాక 6 సినిమాలు చేశాడు.
ప్రతీ సినిమాతో తనదైన మార్క్ వేసుకున్న బాబీ రెండేళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఈ సంవత్సరం సంక్రాంతికి బాలయ్యతో డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాబీ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు బాబీ.
తాను చేసిన ప్రతీ సినిమా నుంచి ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానని చెప్పాడు. డాకు మహారాజ్లో బాలయ్యను కొత్తగా ప్రెజెంట్ చేయాలని మొదటి నుంచి అనుకున్నానని, ఆ ఆలోచనతోనే ప్రతీ సీన్‌ను కొత్తగా రాశానని, సినిమా రిలీజయ్యాక ఆడియన్స్ అభినందిస్తుంటే ఎంతో సంతోషమేసిందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.ప్రస్తుతం చిరంజీవితో ఒక చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







