సెప్టెంబర్ 1 నుండి ఏమేం మారుతాయంటే!
- August 31, 2025
న్యూ ఢిల్లీ: సెప్టెంబర్ నెలలో దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనున్న 56వ జీఎస్టీ సమావేశంలో ప్రస్తుతమున్న నాలుగు పన్ను శ్లాబులకు బదులుగా కేవలం 5% మరియు 18% శ్లాబులను మాత్రమే ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రజలపై పన్ను భారం తగ్గే అవకాశం ఉంది. అలాగే, రేపటి నుంచి, అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వెండి ఆభరణాలకు హాల్ మార్క్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది వెండి కొనుగోలుదారులకు నాణ్యత హామీనిస్తుంది.
డిజిటల్ చెల్లింపుల విషయంలో కూడా కొన్ని మార్పులు రానున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొన్ని క్రెడిట్ కార్డులపై డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా చేసే చెల్లింపులకు రివార్డు పాయింట్లు ఇవ్వకపోవచ్చు. ఈ మార్పు కార్డు వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, జనధన్ ఖాతాలు ఉన్నవారు సెప్టెంబర్ 30 లోపు తమ ఖాతాలకు KYC (నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయాలి. లేకపోతే వారి ఖాతాలు స్తంభించిపోవచ్చు.
పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గడువు తేదీ సెప్టెంబర్ 15. 2025-26 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్) ఫైలింగ్ చేయడానికి ఇదే చివరి తేదీ. ఈ గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయనివారు జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఈ తేదీని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ అన్ని మార్పులు సాధారణ పౌరుల ఆర్థిక కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







