సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్‌కు 2.7మిలియన్ కాల్స్..!!
- August 08, 2026
రియాద్: సౌదీ అరేబియాలో అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉన్న యూనిఫైడ్ ఎమర్జెన్సీ నంబర్ 911కు జూలై నెలలో ఏకంగా 2.73 మిలియన్స్ పైగా కాల్స్ వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ వెల్లడించింది.
మక్కా, మదీనా, రియాద్, ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాంతాల్లో పనిచేస్తున్న యూనిఫైడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్లు జూలైలో మొత్తం 27,33,359 కాల్స్‌ను స్వీకరించాయి. అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత భద్రత, సేవల విభాగాలకు ఫిర్యాదులను చేరవేసి, సహాయక చర్యలను సమన్వయంతో చేపడతారు. జూలైలో అత్యధికంగా రియాద్‌లో 1,129,908 కాల్స్ నమోదయ్యాయి. ఆ తర్వాత మక్కాలో 847,929, ఈస్ట్రన్ ప్రావిన్స్‌లో 514,984 కాల్స్ వచ్చాయి. మదీనా ప్రాంతంలో ఇదే కాలంలో 240,538 కాల్స్ నమోదయ్యాయి.
యూనిఫైడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్లు 24 గంటలూ పనిచేస్తున్నాయి. అత్యాధునిక ఆటోమేటెడ్ వ్యవస్థలు, వివిధ భాషల్లో సేవలందించగల ప్రత్యేక సిబ్బందిని ఉపయోగిస్తూ అత్యవసర కాల్స్‌ను స్వీకరిస్తున్నాయి. కాల్స్ ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించి, అవసరమైన భద్రతా లేదా సేవా విభాగాలకు వేగంగా చేరవేయడంతో పాటు సంబంధిత అధికారుల స్పందనను సమన్వయం చేస్తున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







