24శాతం పెరిగిన సౌదీ ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో..!!
- September 04, 2025
రియాద్: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించడానికి సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. 2024లో ఇన్‌ఫ్లోలు 24.2 శాతం పెరిగి SR119.2 బిలియన్లకు చేరుకున్నాయి. 2017లో SR501.8 బిలియన్లతో పోలిస్తే, FDI స్టాక్ దాదాపు రెట్టింపు అయి SR977.3 బిలియన్లకు చేరుకుంది.
క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ 2021లో ప్రారంభించిన జాతీయ పెట్టుబడి వ్యూహాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని సౌదీ అరేబియా పెట్టుబడుల మంత్రి ఖలీద్ అల్-ఫలిహ్ తెలిపారు. ప్రపంచ కంపెనీలు తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను సౌదీకి తరలించేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొంటున్నారు. మొత్తం పెట్టుబడుల్లో 76 శాతం ప్రభుత్వ, చమురుయేతర ప్రైవేట్ రంగంలోనే వచ్చాయని తెలిపారు.
ఇదే కాలంలో విభిన్న రంగాలకు చెందిన దాదాపు 50వేల కంటే ఎక్కువ విదేశీ పెట్టుబడి లైసెన్సులను జారీ చేసినట్లు వెల్లడించారు. సౌదీ అరేబియా విజన్ 2030 లక్ష్యాలను సాధించడానికి అవసరమైన వృద్ధి, ఆర్థిక వైవిధ్యీకరణను వేగవంతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







