ఒమన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒప్పందం..!!

- September 04, 2025 , by Maagulf
ఒమన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒప్పందం..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ -సౌదీ అరేబియా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. స్టాటిస్టికల్ మరియు సమాచార రంగాలలో సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI)లో కుదిరిన ఈ ఒప్పందం, రెండు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోనుంది.

NCSI CEO డాక్టర్ ఖలీఫా అబ్దుల్లా అల్ బర్వానీ, సౌదీ అరేబియాలోని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) అధ్యక్షుడు డాక్టర్ ఫహద్ అబ్దుల్లా అల్ దోసరి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

నైపుణ్యాలను షేర్ చేసుకోవడం ద్వారా స్టాటిస్టికల్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడం, స్టాటిస్టికల్ డేటా ప్రాధాన్యత, రెండు దేశాల నిపుణుల మధ్య ఉమ్మడి సమావేశాలు మరియు వర్క్‌షాప్‌లను నిర్వహించడం , భవిష్యత్ లో మెరుగైన సహకారం అందించడం ఈ ఒప్పందం లక్ష్యమని వారు పేర్కొన్నారు. సమగ్ర GCC స్టాటిస్టికల్ వ్యవస్థను స్థాపించే దిశగా ఈ అవగాహన ఒప్పందం ఒక ముందడుగు అవుతుందని అల్ బర్వానీ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com