హీరో శివకార్తికేయన్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- September 05, 2025
శివకార్తికేయన్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి'. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఫస్ట్ టైం ఎ.ఆర్. మురుగదాస్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్స్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్. చాలా కూల్ గా ఉంటారు. చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా షూటింగ్ అంతా చాలా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆయనతో కలిసి వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు.
ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ పాత్ర ఎలా వుంటుంది?
-ఈ సినిమాలో లవ్, యాక్షన్ రెండు పిల్లర్స్.అందులో లవ్ పోర్షన్ అద్భుతంగా రావడానికి కారణం రుక్మిణి. ఈ సినిమాలో తన పాత్ర చాలా కీలకం.కథకి ఎమోషన్ యాడ్ చేసే రోల్ అది. తన పెర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్ ఎసెట్.
మదరాసి సినిమా ఎలా ఉండబోతోంది?
-మదరాసి కథ చాలా కొత్తగా వుంటుంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఎమోషన్, యాక్షన్, కాన్వాస్ పరంగా బిగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది.
-ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. యాక్షన్ లో మ్యాడ్ నెస్ వుంటుంది. అది ఆడియన్స్ కి చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. బిగ్ స్క్రీన్ పై సినిమా సెలబ్రేట్ చేసుకునేలా వుంటుంది.
అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ గురించి?
-అనిరుధ్ నేను బెస్ట్ ఫ్రెండ్స్. మా కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ గా హిట్ అయ్యాయి.ఈ సినిమా కూడా మ్యూజికల్ గా అద్భుతంగా వచ్చింది.
-అనిరుధ్ బిట్స్ హెవీగా ఉంటాయి.ఈ సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక లెగ్ మూమెంట్ ఉన్న సాంగ్ చేశాను.అది మంచి ఎక్స్పీరియన్స్.ఈ సినిమాలో రీరికార్డింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
-సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రాఫర్ చాలా ప్రత్యేకంగా వుంటుంది. శ్రీకర్ ప్రసాద్ సినిమాని అద్భుతంగా కట్ చేశారు. అరుణ్ వెంజరమూడు వర్క్ ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా రిచ్ గా వుంటుంది. టెక్నికల్ గా సినిమాని అత్యున్నతంగా తీర్చిదిద్దాం. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది.
బీజు మీనన్, విద్యుత్ జమ్వాల్ గురించి?
-ఈ సినిమాలో మరో రెండు పిల్లర్స్ విలన్ విద్యుత్ జమ్వాల్, బీజు మీనన్. విద్యుత్ జమ్వాల్ తో చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటాయి.
-బీజు మీనన్ అద్భుతమైన యాక్టర్. వాయిస్ మ్యాడులేషన్ తో ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.ఈ సినిమాతో ఆయన్ని దగ్గరుండి గమనించే అవకాశం దొరికింది.
నిర్మాతల సపోర్ట్ గురించి?
-ప్రొడ్యూసర్ తిరుపతి ప్రసాద్ చాలా సింపుల్ పర్సన్. చాలా పెద్ద సినిమా తీశారు.కంటెంట్ ఉంటే ఎంతైనా ఖర్చు చేస్తారు.ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా ఎక్కడరాజీ పడకుండా గ్రేట్ పాషన్ తో చాలా గ్రాండ్ స్కేల్ లో తీశారు. డైరెక్టర్ విజన్ కి చాలా సపోర్ట్ చేశారు.
తెలుగు, తమిళ్ ఆడియన్స్ కి ఏదైనా డిఫరెన్స్ గమనించారా?
-ఏం లేదు. సినిమా బాగుంటే కచ్చితంగా సినిమాని ప్రేమిస్తారు. తెలుగు తమిళ్ ప్రేక్షకుల అభిరుచులు కూడా ఒకేలా వుంటాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా బావుంటే అంటే ప్రతి సినిమాని ఆదరిస్తారు.వాళ్ళకి మంచి సినిమానా కాదా అనేదే ముఖ్యం.
-ఇప్పటి వరకు నా సినిమాలు రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు, అమరన్ కు మంచి సపోర్ట్ ఇచ్చారు.పెద్ద గుర్తింపు ఇచ్చారు.అద్భుతమైన కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకి కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
తాజా వార్తలు
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్‌పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!







