నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- September 05, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో జాబ్ మేళా నిర్వహించనుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం, కుంభంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(స్కిల్ హబ్)లో సెప్టెంబర్ 6న ఈ జాబ్ మేళా జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. కాబట్టి, రాష్ట్రంలోని యువత తప్పకుండా ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇంకా ఈ జాబ్ మేళా గురించి మరింత సమాచారం కోసం 7997151082 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
సంస్థలు, ఖాళీల వివరాలు:
- రేస్ డైరెక్ట్ సర్వీసెస్ లో 20 పోస్టులు
- స్విగ్గీ – ఫుడ్ డెలివరీ సేవలు లో 50 పోస్టులు
- బజాజ్ అలియాంజ్ లో 20 పోస్టులు
- క్రెడిట్‌ఆక్సెస్ గ్రామీణ్ లో 20 పోస్టులు
- డివిస్ లో 30 పోస్టులు
తాజా వార్తలు
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!







