వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- October 07, 2025
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..అతి త్వరలో వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ వచ్చేస్తోంది. ఇన్స్టంట్ మెసేజింగ్ దిగ్గజం ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే స్పెషల్ యూజర్ నేమ్ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్ రివీల్ కాకుండానే ఇతరులతో చాట్ చేయొచ్చు. ఈ లేటెస్ట్ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది.
ఇప్పుడు వాట్సాప్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ (2.25.28.12)లో గుర్తించారు. వాట్సాప్ యూజర్లు ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్‌లలో మాదిరిగా యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకోవచ్చు. తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటాలో అందుబాటులో ఉంది. అతి త్వరలో రెగ్యులర్ వాట్సాప్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.
యూజర్ నేమ్ క్రియేషన్ కోసం కొత్త రూల్స్ ఇవే:
- వాట్సాప్ యూజర్‌నేమ్ క్రియేట్ చేసేందుకు నిర్దిష్ట మార్గదర్శకాలను అందిస్తోంది.
- యూజర్ నేమ్‌లో “www” అనే లెటర్స్ ఉండకూడదు.
- కనీసం ఒక అక్షరమైనా ఉండాలి.
- అల్ఫబెట్తో పాటు సంఖ్యలు, అండర్ స్కోర్లు ఉండొచ్చు.
బీటా టెస్టింగ్‌లో యూజర్ నేమ్ ఫీచర్:
ప్రస్తుతానికి, ఈ కొత్త యూజర్‌నేమ్ ఫీచర్ ఆండ్రాయిడ్‌లోని లిమిటెడ్ బీటా యూజర్ల గ్రూపుతో టెస్టింగ్ జరుగుతోంది. ఇంకా గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ కింద ఉన్న యూజర్లందరికి ఇంకా అందుబాటులోకి రాలేదు. నివేదిక ప్రకారం.. వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌ను త్వరలో మరిన్ని బీటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెగ్యులర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
యూజర్ నేమ్ రిజర్వ్ ఆప్షన్:
వాట్సాప్ ఇప్పుడు వినియోగదారుల కోసం హ్యాండిల్ లేదా యూజర్ నేమ్ రిజర్వ్ చేసుకునేందుకు ఆప్షన్ అందిస్తుంది. యాప్ సెట్టింగ్‌లలో మీకు నచ్చిన యూజర్ నేమ్‌ను మీరు ఎంచుకోవచ్చు. ఒకసారి రిజర్వ్ చేసుకున్నాక మరే ఇతర యూజర్ ఈ యూజర్ నేమ్ ఉపయోగించలేరు.
ఈ ఫీచర్ ఇప్పటికే సిగ్నల్, టెలిగ్రామ్, ఐమెసేజ్ వంటి యాప్‌లలో అందుబాటులో ఉంది. ఈ యాప్‌లలో, వ్యక్తులు యూజర్ నేమ్ లేదా ఇమెయిల్ ఉపయోగించి కూడా కనెక్ట్ కావచ్చు. యూజర్‌నేమ్‌లతో పాటు ప్రొఫైల్ ప్రొటెక్షన్ కోసం పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. కొత్త సెక్యూరిటీ ఫీచర్లపై కూడా వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది.
కొత్త ఫీచర్ బెనిఫిట్స్ ఏంటి?
ఇప్పటి వరకు, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు మొబైల్ నంబర్ మాత్రమే అవసరం.ఈ విధానం చాలా ఈజీగా ఉంటుంది. కానీ, ప్రైవసీ పరంగా ఇబ్బందిని కలిగిస్తుంది. మీకు తెలియని వ్యక్తులు మీ నంబర్‌ను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు.. మీ ఫోన్ నంబర్‌ను మార్చవలసి వస్తే.. మీ అకౌంట్ ట్రాన్స్‌లేట్ చేయడం కష్టంగా ఉంటుంది. కానీ, ఇప్పుడు యూజర్ నేమ్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను మార్చకుండానే తమ అకౌంట్ ఈజీగా వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!







