ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- October 07, 2025
హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు హర్యానా రోహ్ తక్ నుంచి గుమర్ విన్ కు వెళ్తోంది. బిలాస్ పూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో భారీ వర్షం పడుతోంది. దాంతో కొండచరియలు విరిగి బస్సు మీద పడ్డాయి. బస్సు నుంచి 15 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు. బిలాస్ పూర్ లో వర్షం కుమ్మేసింది. మంగళవారం అక్కడ 12.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలను తీసుకొచ్చి శిథిలాలను తొలగిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అర్థరాత్రి వరకు రెస్క్యూ, సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!
- ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ సౌత్ అల్ బటినా..!!
- ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ కేంద్రంగా కటారా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టిన రియాద్ మెట్రో..!!
- బహ్రెయిన్‌లో 8 ఇల్లీగల్ హెల్త్ సైట్స్.. 56 లైసెన్స్ లేని ప్రాక్టీషనర్లు..!!
- ఇన్స్టాగ్రామ్ లో మైనర్ పై అనుచిత చర్యలు..Dh5,000 ఫైన్..!!
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..
- సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు...
- రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు భారీ ఎదురుదెబ్బ







