'ది బ్లాక్ గోల్డ్'- రేపు ఫస్ట్ లుక్ రిలీజ్
- October 20, 2025
టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ యోగేష్ కెఎంసి దర్శకత్వంలో చేస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి విజయవంతమైన చిత్రాలు అందించిన నిర్మాత రాజేష్ దండా నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ తో కలిసి చేస్తున్న ఆరవ సినిమా ఇది. సంయుక్త స్వయంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు, ఇది కంటెంట్ పై ఆమెకున్న నమ్మకాన్ని చూపిస్తుంది. సింధు మాగంటి సహ నిర్మాత.
ఈరోజు, మేకర్స్ ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి' ది బ్లాక్ గోల్డ్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు విడుదల కానుంది.
దర్శకుడు యోగేష్ కెఎంసి థ్రిల్లర్ జానర్ కి కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ, ప్రేక్షకులకు థ్రిల్ చేయబోతున్నారు. సంయుక్త డైనమిక్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన స్టంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఎ వసంత్ కెమెరా మ్యాన్ కాగా, సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్, చోటా కె ప్రసాద్ ఎడిటర్. రామ్ కృష్ణ యాక్షన్ డైరెక్టర్. యోగేష్ కెఎంసితో పాటు, కథ సంభాషణలను ప్రసాద్ నాయుడు రాశారు. దర్శకుడు స్వయంగా స్క్రీన్‌ప్లే రాశారు. మధు విప్పర్తి స్క్రిప్ట్ కోఆర్డినేటర్.
ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది.
తారాగణం: సంయుక్త
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: యోగేష్ KMC
నిర్మాత: రాజేష్ దండా
సహ నిర్మాత: సింధు మాగంటి
డీవోపీ; ఎ వసంత్
సంగీతం: సామ్ సిఎస్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
కథ & డైలాగ్స్: యోగేష్ KMC & ప్రసాద్ నాయుడు
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: మధు విప్పర్తి
యాక్షన్: రామ్ కృష్ణ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







