యూఏఈలో ఘనంగా దీపావళి వేడుకలు..!!
- October 21, 2025
యూఏఈ: యూఏఈ అంతటా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇళ్లను రంగురంగుల దీపాలతో అలకరించారు. దుబాయ్ అంతటా పెద్ద మరియు చిన్న కంపెనీలు పండుగ స్ఫూర్తిని ప్రదర్శించాయి. దీపావళి వేడుకలను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు.
దీపావళి సందర్భంగా ఆటలు, భోజనం మరియు అనేక ఇతర ర్యకలాపాలను నిర్వహించుకున్నట్లు క్రెస్టన్ మీనన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ లో పనిచేసే స్వాతి అరోరా తెలిపారు. మరోవైపు ఆస్పైర్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ మెటీరియల్స్ ట్రేడింగ్ LLCలో దీపావళి వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయని ఫైనాన్స్ మేనేజర్ చారు గుప్తా చెప్పారు. దుబాయ్ మెరీనాలో యాచ్ పార్టీతో సహా దీపావళికి ముందు వేడుకలు జరుపుకున్నామని గుప్తా అన్నారు. ధంతేరాస్ నాడు, తాము అన్ని కార్యాలయ సిబ్బందికి శాఖాహార థాలీ భోజనం వడ్డించామని తెలిపారు. ఫుడ్ బాక్సులను పంపిణీ చేసామన్నారు. తమ వద్ద పనిచేసే కార్మికుల బృందానికి స్వీట్ బాక్సులను అందించినట్లు తెలిపారు.
తమ ఆఫీసులో దీపావళి వేడుకలు ఇంటిని గర్తుచేసిందని MFCలో అసిస్టెంట్ ఆపరేషన్స్ అయిన నమితా అనీష్ తెలిపారు. స్వీట్లు, ప్రత్యేక భోజనాలతో వేడుకలను జరుపుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా H-1B వీసా ఫీజు పై సంచలన నిర్ణయం
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- 20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!
- సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై కొరడా..!!
- యూఏఈలో ఘనంగా దీపావళి వేడుకలు..!!