సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- November 10, 2025
రియాద్ః సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చించాయి. యూఎన్ పర్యాటక జనరల్ అసెంబ్లీ 26వ సమావేశంలో పాల్గొనడానికి రియాద్‌కు వచ్చిన భారత సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సౌదీ సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బాదర్ బిన్ అబ్దుల్లా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు రెండు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలపై సమీక్షించారు. సాంస్కృతిక మరియు ఇతర రంగాల్లో సహకారానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. రెండు దేశాలలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలు మరియు కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించారు.
అంతకుముందు "గ్లోబల్ హార్మొనీ 2" లో భాగంగా రియాద్‌లోని సువైది పార్క్‌లో జరిగిన భారతీయ సాంస్కృతిక వారోత్సవ కార్యక్రమాలను భారత మంత్రి షెకావత్ సందర్శించారు. ఇది 49 రోజుల పాటు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







