యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!

- November 10, 2025 , by Maagulf
యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!

యూఏఈః గ్రీన్ రెసిడెన్సీ అని పిలువబడే ఫ్రీలాన్స్ వీసాల మంజూరుకు సంబంధించిన సమీక్ష మరియు ఆడిటింగ్ విధానాలను కఠినతరం చేయాలని యూఏఈ యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి ఒక్కరి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా మార్కెట్‌ను నియంత్రించడం  తమ లక్ష్యమని దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) డైరెక్టర్ జనరల్ జనరల్ లెఫ్టినెంట్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి అన్నారు. అయితే, ఈ స్వయం ఉపాధి అనుమతులను నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లను అల్ మర్రి తోసిపుచ్చారు. అధికారిక మార్గాల ద్వారా ఫ్రీలాన్స్ వీసాల జారీ కొనసాగుతుందని పేర్కొన్నారు.
కాగా, ఈ రకమైన రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేయడం లేదా వీసాల దుర్వినియోగానికి సంబంధించి ఇటీవల కొన్ని కేసులు నమోదైనట్లు ఆయన అన్నారు.  
స్వయం ఉపాధిని మరియు టాలెంట్ ఎకానమీ అని పిలువబడే అత్యంత ప్రముఖ ప్రభుత్వ కార్యక్రమాలలో యూఏఈ ఫ్రీలాన్స్ వీసా ఒకటి. ఇది దరఖాస్తుదారులు స్పాన్సర్ లేదా యజమాని అవసరం లేకుండా చట్టబద్ధంగా వారి వృత్తిపరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఫ్రీలాన్స్ వీసా కలిగి ఉన్నవారు చట్టబద్ధమైన నివాసానికి అర్హులు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com