'చఠా పచా–రింగ్ ఆఫ్ రౌడీస్' ఆంధ్ర-తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్
- November 26, 2025
మలయాళ సినిమాలో మొట్టమొదటి పూర్తి నిడివి గల WWE-జానర్ యాక్షన్-కామెడీ చిత్రం “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ను ప్రముఖ తెలుగు నిర్మాణ-పంపిణీ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా రిలీజ్ చేయనుంది. జనవరి 2026లో విడుదల కానున్న ఈ చిత్రం కేరళలో దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది.
ఈ చిత్రానికి నూతన దర్శకుడు అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించగా, రీల్ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థను ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లెన్స్‌మన్ గ్రూప్ కలిసి ఏర్పాటు చేశాయి. రమేష్, రితేష్ రామకృష్ణన్, షిహాన్ షౌక్కత్, ఎస్. జార్జ్ మరియు సునీల్ సింగ్‌లు ఈ వెంచర్‌లో కీలక భాగస్వాములు.
అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, ఇషాన్ షౌక్కత్ (“మార్కో” ఫేమ్), విశాఖ్ నాయర్, పూజా మోహన్‌దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
WWE రెజ్లింగ్, ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే పాత్రల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం భారీ రెజ్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇంతకుముందు సోషల్ మీడియాలో తుఫాను సృష్టించిన ఈ టీజర్ ప్రత్యేకమైన పాత్ర గెటప్‌లు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను చూపించింది. ఫోర్ట్ కొచ్చిలోని WWE-జానర్ రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప యాక్షన్-కామెడీ ఎక్స్ పీరియన్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం టీజర్, పోస్టర్లు, రెగ్యులర్ అప్‌డేట్‌లతో అంచనాలను పెంచుతూనే ఉంది. సహాయక తారాగణంలో సిద్ధిక్, లక్ష్మీ మీనన్, మనోజ్ కె జయన్, ఖలీద్ అల్ అమెరి, రఫీ, టెస్ని ఖాన్, ముత్తుమణి, కార్మెన్ ఎస్ మాథ్యూ, డి'ఆర్టగ్నన్ సాబు, వైష్ణవే బిజు, శ్యామ్ ప్రకాష్, కృష్ణన్ నంబియార్, మినాన్, సరీన్ షిహాబ్, వేదిక శ్రీకుమార్, ఓర్హాన్, ఆల్విన్ ముకుంద్, అర్చిత్ అభిలాష్, తోష్ & తోజ్ క్రిస్టీ, ఆష్లే ఐజాక్ అబ్రహం ఉన్నారు.
పాన్-ఇండియా విడుదలగా, ఈ చిత్రం ఉత్తర భారత థియేట్రికల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. PVR ఐనాక్స్ పిక్చర్స్ తమిళనాడు, కర్ణాటకలో రిలీజ్ చేస్తుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషలలో 115 కంటే ఎక్కువ దేశాలలో విడుదల అవుతుంది.
ప్రఖ్యాత బాలీవుడ్ త్రయం శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం సమకూర్చారు. సాహిత్యం వినాయక్ శశికుమార్ రాశారు. మ్యూజిక్ రైట్స్ T-సిరీస్ సొంతం చేసుకున్నాయి.
సాంకేతిక సిబ్బంది:
సినిమాటోగ్రఫీ – ఆనంద్ సి చంద్రన్;
ఎడిషినల్ సినిమాటోగ్రఫీ - జోమోన్ టి జాన్, సుదీప్ ఎలామన్
ఎడిటింగ్ - ప్రవీణ్ ప్రభాకర్
యాక్షన్ - కలై కింగ్సన్
కాస్ట్యూమ్ డిజైన్ - మెల్వి
మేకప్ - రోనాక్స్ జేవియర్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ముజీబ్ మజీద్
రచన - సనూప్ తైక్కుడం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - జార్జ్ ఎస్
లైన్ ప్రొడ్యూసర్ - సునీల్ సింగ్
ఆర్ట్ - సునీల్ దాస్
సౌండ్ డిజైన్ - శంకరన్ ఎ ఎస్, కె సి సిద్ధార్థన్
సౌండ్ మిక్సింగ్ - అరవింద్ మీనన్
ప్రొడక్షన్ కంట్రోలర్ - ప్రశాంత్ నారాయణన్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్ - అరీష్ అస్లాం, జిబిన్ జాన్
స్టిల్ ఫోటోగ్రఫీ - అర్జున్ కల్లింగల్
కలరిస్ట్ - శ్రీక్ వారియర్
పబ్లిసిటీ డిజైన్ - యెల్లో టూత్స్
VFX - విశ్వ FX
DI - కలర్ ప్లానెట్ స్టూడియోస్
యానిమేషన్స్ - యునోయియన్స్
డబ్బింగ్ డైరెక్టర్ - RP బాలా (RP స్టూడియోస్)
మెర్కండైజ్ పార్టనర్ - ఫుల్లీ ఫిల్మీ
PRO - వంశీ శేఖర్
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







