లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- November 26, 2025
న్యూఢిల్లీ: లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఈరోజు ఢిల్లీలో సమావేశమైంది.మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.వివిధ కేంద్ర సంస్థలు, నియంత్రణ మండళ్ల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ సాగింది.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరఫున సెక్రటరీ పుణ్య సలీల శ్రీవాత్సవ,అడిషనల్ సెక్రటరీ డాక్టర్ వినోద్ కొత్వాల్, డైరెక్టర్ కుమార్ రాహుల్ పాల్గొన్నారు. ఆరోగ్య విధానాలు, అమలు, ప్రజలకు అందే సేవల నాణ్యత తదితర అంశాలపై కమిటీ సభ్యులకు వీరు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) నుండి చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేథ్, MARB ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్, డైరెక్టర్ రాజీవ్ శర్మ సమావేశంలో పాల్గొన్నారు.మెడికల్ విద్య, ప్రమాణాలు, వైద్యుల నమోదు ప్రక్రియల పై చర్చ జరిగింది.
అదేవిధంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుండి సీఈఓ రంజిత్ పునహాని, డైరెక్టర్ (QA) డాక్టర్ అమిత్ శర్మ, డైరెక్టర్ (రెగ్యులేషన్) డాక్టర్ అనిల్ శర్మ కూడా పాల్గొన్నారు. ఆహార భద్రత, నాణ్యత నియంత్రణ, దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఆహార ప్రమాణాలతో సంబంధించి విస్తృత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
కమిటీ సూచనలు, వివరాలు తదుపరి సమావేశాల్లో పరిశీలించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!







