'ఛాంపియన్' నుంచి రస్టిక్ మెలోడీ 'గిర గిర గింగిరాగిరే' రిలీజ్
- November 27, 2025
యంగ్ హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా'ఛాంపియన్'తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు.జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.కథల ఎంపికలో, ప్రతిసారీ బ్లాక్బస్టర్లను అందించడంలో స్వప్న సినిమాస్ వెరీ స్పెషల్. ఫస్ట్-లుక్ పోస్టర్లు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్- గిర గిర గింగిరాగిరే ప్రోమో కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ రోజుగిర గిర గింగిరాగిరే పాట లిరికల్ వీడియో విడుదలైంది.
మిక్కీ జే మేయర్ ఈ సాంగ్ ని మెలోడీయస్ ట్రీట్ గా కంపోజ్ చేశారు. మనుసని హత్తుకునే విధంగా కట్టిపడేసేలా వుంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం గ్రామ జీవితం, బంధాలు, అల్లికలా ఒక ప్రత్యేకతని తీసుకొస్తుంది. రామ్ మిరియాల రా, రస్టిక్ వాయిస్ పాటకు మరింత స్పెషల్ గా మార్చింది.
రోషన్ – అనస్వరల మధ్య కెమిస్ట్రీ అందంగా ఉంది. రోషన్ తన ఎనర్జీ, గ్రేస్‌తో ఆకట్టుకుంటే, అనస్వర తన సహజమైన అందంతో మంత్రముగ్ధులను చేస్తుంది. ఇద్దరి ఆన్-స్క్రీన్ జోడీ మనసుకి దగ్గరగా అనిపిస్తుంది.
తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతమైన డీటెయిల్స్‌తో రిక్రియేట్ చేశారు, ఆర్. మధీ కెమెరా వర్క్ ఆ ప్రపంచంలోకి మనల్ని లీనం చేస్తుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు.
గిర గిర గింగిరాగిరే తో చాంపియన్ సంగీత ప్రయాణం అద్భుతంగా ఆరంభమైయింది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రిస్మస్ ప్రేక్షకులకు మనసుని హత్తుకునే సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.
తారాగణం: రోషన్, అనస్వర రాజన్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్లు: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్
సమర్పణ: జీ స్టూడియోస్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
డిఓపి: ఆర్ మధీ
సంగీతం: మిక్కీ జె మేయర్
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?







