'మన శంకరవరప్రసాద్ గారు' కోసం మాస్ డ్యాన్స్ సాంగ్ షూటింగ్ ప్రారంభం
- November 30, 2025
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల 72 మిలియన్లకు పైగా వ్యూస్ ని సంపాదించి ఎప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ ని విశేషంగా అలరించనుంది.
హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిరంజీవి, వెంకటేష్ లపై స్టైలిష్ డ్యాన్స్ సాంగ్ షూటింగ్ ని మేకర్స్ ప్రారంభించారు. తొలిసారిగా, చిరంజీవి, వెంకటేష్ ఒక ఉత్సాహభరితమైన, గ్రాండ్ సెలబ్రేషన్ నంబర్ లో కలిసి అలరిస్తున్నారు.
ఈ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన బీట్స్ తో పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్ ని కంపోజ్ చేశారు. ఈ పాటలో 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ పాటలో సెట్ ని కలర్, రిథమ్, వైబ్ ల కార్నివాల్ గా మార్చారు. ఇద్దరు స్టార్‌ల కెమిస్ట్రీ, ఎనర్జీ ప్రేక్షకులని అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయనుంది.
బ్లాక్ బస్టర్ హిట్ మీసాల పిల్లకి కొరియోగ్రఫీ చేసిన పొలకి విజయ్ ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ అందించడం విశేషం.
చిరంజీవి, వెంకటేష్ కలసి అదరగొట్టబోతున్న ఈ సాంగ్ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫీస్ట్ కానుంది.
త్వరలోనే చిరంజీవి నయనతారలపై చిత్రీకరించిన ఒక మెలోడియస్ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







