30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- December 16, 2025
షార్జా: 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు అయినట్లు షార్జా పోలీసులు తెలిపారు. నవంబర్ 1న షార్జా ఎమిరేట్‌లో లేన్ల వినియోగాన్ని నియంత్రించే చట్టం అమల్లో వచ్చిందని, అప్పటినుండి భారీగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం డెలివరీ బైక్‌లు, భారీ వాహనాలు, మోటార్‌సైకిళ్లు మరియు బస్సుల కోసం నిర్దిష్ట లేన్లను మాత్రమే ఉపయోగించాలి. రహదారులపై భద్రతను పెంచడానికి ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినట్టు పోలీసులు తెలిపారు.
నిర్దేశిత లేన్లలో వెళ్లని భారీ వాహనాలకు Dh1,500 జరిమానా మరియు 12 బ్లాక్ పాయింట్లు, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు నియమాలను పాటించనందుకు అదనంగా Dh500 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. రహదారులపై భద్రతను కాపాడేలా షార్జా పోలీసులు ట్రాఫిక్ పెట్రోలింగ్‌లతో పాటు స్మార్ట్ రాడార్లు, ఆధునిక కెమెరాలను ఉపయోగించి నిఘాను పర్యవేక్షిస్తున్నారు.ట్రాఫిక్ మార్గదర్శకాలను ప్రతిఒక్కరూ పాటించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







