కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- December 16, 2025
జెడ్డా: 2025 ఏడాదికి సంబంధించి కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) 50 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించి చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. సౌదీ విమానాశ్రయంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక వార్షిక ప్రయాణీకుల సంఖ్య ఇదేనని అధికారులు తెలిపారు.విమానాశ్రయం కీలకమైన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గేట్వేగా మారడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మరియు రెండు పవిత్ర మసీదులకు ప్రధాన ఎయిర్ గేట్వేగా సౌదీ అరేబియా మారిందని తెలిపారు.
జెడ్డాలో ఒక క్రీడా కార్యక్రమానికి హాజరు కావడానికి సౌదీ విమానంలో పారిస్ నుండి వచ్చిన ఫ్రెంచ్ ప్రయాణీకుడిని జెడ్డాలో విమానాశ్రయం సిబ్బంది 50 మిలియన్ల ప్రయాణీకుడిగా స్వాగతించారు. అనంతరం స్మారక బహుమతిని అందజేసినట్టు జెద్దా విమానాశ్రయాల కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంజినీర్ మాజెన్ జోహార్ తెలిపారు. 50 మిలియన్ల మంది ప్రయాణికులను చేరుకోవడం విమానాశ్రయం అధిక కార్యాచరణ సంసిద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రయాణీకుల సంఖ్యను రెట్టింపు చేయడం, మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







