'బుకీ' నుంచి బ్రేకప్ యాంథమ్ తొక్కలో మనసు పగిలేనే రిలీజ్
- December 18, 2025
విజయ్ ఆంటోనీ, అజయ్ దిషన్, రామంజేయులు జవ్వాజీ, శరవంత్ రామ్ క్రియేషన్స్, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ 'బుకీ' నుంచి బ్రేకప్ యాంథమ్ తొక్కలో మనసు పగిలేనే రిలీజ్
అజయ్ దిషన్, ధనుష హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బుకీ'. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు. విఎఎఫ్సి ప్రజెంట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ 'బుకీ' బ్రేకప్ యాంథమ్ తొక్కలో మనసు పగిలేనే సాంగ్ ని రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని ఈ సాంగ్ ని అద్భుతమైన వైబ్ తో కంపోజ్ చేశారు. విజయ్ ఆంటోని, ఖరెస్మా రవిచంద్రన్ ఎనర్జిటిక్ వోకల్స్ ఆకట్టుకున్నాయి. భాష్యశ్రీ సాహిత్యం క్యాచిగా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా హిట్ అయ్యింది.
ఈ చిత్రంలో పాండియరాజన్, సునీల్, లక్ష్మి మంచు, ఇందుమతి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నటీనటులు: అజయ్ దిషన్, ధనుష, పాండియరాజన్, సునీల్, లక్ష్మి మంచు, ఇందుమతి మణిగండన్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పాండి, ఆదిత్య, బిగ్ బాస్ సత్య, M.J శ్రీరామ్, రాధ, అశ్విన్ రామ్, షియారా శర్మి, ప్రియాంక
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం-డీవోపీ: గణేష్ చంద్ర
నిర్మాత: రామంజేయులు జవ్వాజీ
బ్యానర్: శరవంత్ రామ్ క్రియేషన్స్, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్
ప్రజెంట్స్: విఏఎఫ్సి
మ్యూజిక్ : విజయ్ ఆంటోనీ
రైటర్: పుతియ పరిథి
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







