మిసెస్‌ ఎర్త్‌ ఇంటర్నేషనల్‌-2025గా విద్యా సంపత్‌

- December 18, 2025 , by Maagulf
మిసెస్‌ ఎర్త్‌ ఇంటర్నేషనల్‌-2025గా విద్యా సంపత్‌

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్–2025 ఫైనల్ పోటీల్లో విద్యా సంపత్ విజేతగా నిలిచి, భారత్‌కు తొలి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం అందించారు. మంగళూరుకు చెందిన విద్య ముంబయిలో పుట్టి పెరిగారు. ఈ పోటీల్లో జాతీయ పక్షి నెమలి, జాతీయ ప్రాణి పులి, జాతీయ పుష్పాన్ని పోలిన వస్త్రాలను ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. 22 దేశాలకు చెందిన ప్రతిభావంతమైన అందాల భామలతో పోటీపడి ఈ ఘనత సాధించడం విశేషంగా నిలిచింది.

ఇంతకుముందు మిసెస్ ఇండియా ఆస్ట్రల్ కర్ణాటక రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్న విద్య , ప్రస్తుతం మంగళూరులోని చిత్రాపుర్‌లో ఒక సూపర్‌మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు. ఒక వైపు విజయవంతమైన వ్యాపారవేత్తగా, మరో వైపు మోడల్‌గా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. చిన్నప్పటినుంచే, కళలు, సంస్కృతి, సామాజిక సేవలపై ప్రత్యేక ఆసక్తి కలిగిన విద్య, వివాహం తర్వాత కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు తమ లక్ష్యాలను కూడా సాధించవచ్చని నిరూపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com