షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- December 22, 2025
దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నాద్ అల్ షెబాలోని తన మజ్లిస్‌లో X యజమాని మరియు టెస్లా CEO ఎలోన్ మస్క్‌ను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతరిక్షం, సాంకేతికత మరియు మానవత్వంపై ఎలోన్ మస్క్‌తో విస్తృత చర్చను తాను పూర్తిగా ఆస్వాదించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడటానికి ఉత్సాహంగా ఉందన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ రాజధానిగా ఎమిరేట్ స్థానాన్ని పదిలం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో ఎలోన్ మస్క్ ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ (WGS)లో దుబాయ్ లూప్ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించారు. 11 స్టేషన్లను కలిగి ఉన్న 17 కి.మీ. లూప్, ప్రత్యక్ష, నాన్-స్టాప్ మార్గంలో గంటకు 20,000 మంది ప్రయాణికులను తీసుకువెళుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలతో నడిచే ఈ వ్యవస్థ గంటకు 160 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ఈ ప్రాజెక్ట్ ఎమిరేట్‌లో "రవాణాలో విప్లవాత్మక మార్పులు" తీసుకురాగలదని షేక్ హమ్దాన్ తన పోస్టులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!







