మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- December 22, 2025
దోహా: యూట్యూబ్ ఐకాన్ మిస్టర్‌బీస్ట్ మరియు అతని ఆన్‌స్క్రీన్ టీమ్ మెంబర్ తారెక్ సలామెహ్ జనవరి 2026లో జరగనున్న మ్యాచ్ ఫర్ హోప్ 2026 టోర్నమెంట్ కోసం టీమ్ అబోఫ్లాలో చేరనున్నారు. నిర్వాహకుల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ మేరకు వెల్లడించారు. మిస్టర్‌బీస్ట్ తనదైన సరదా శైలిలో, తాను మరియు తారెక్ మ్యాచ్ ఫర్ హోప్ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. విద్యకు నోచుకోని పిల్లల కోసం నిధులు సేకరిస్తూ జట్టు కోసం గోల్స్ చేస్తామని ప్రకటించారు.
ఈ టోర్నమెంట్ జనవరి 30న దోహాలోని ప్రతిష్టాత్మక అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో జరుగుతుంది. మ్యాచ్ ఫర్ హోప్ 2026లో టీమ్ చంక్జ్ మరియు టీమ్ అబోఫ్లా మధ్య మ్యాచ్ జరుగనుంది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు మరియు కంటెంట్ క్రియేటర్లతో కూడిన శక్తివంతమైన లైనప్ రెండు జట్ల తరపున ఆడతారు. ఈ మ్యాచ్‌లో KSI, షార్కీ, బిల్లీ వింగ్రోవ్, డానీ ఆరోన్స్, యాంగ్రీ జింజ్, హ్యారీ పినెరో, అమర్ నస్సౌహీ, లువా డి పెడ్రెరో, మార్లోన్, ఫనమ్, ఈడెన్ హజార్డ్, థియరీ హెన్రీ, మార్సెలో వీరా డా సిల్వా జూనియర్ మరియు డియెగో కోస్టా వంటి సూపర్ స్టార్ లు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!







