దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- December 22, 2025
దుబాయ్: దుబాయ్‌లో నిర్వహించిన తెలుగు వారి ఆత్మీయ సమావేశంలో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకంతో పాటు దాని ఆడియో పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు టి.డి.జనార్దన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ అపూర్వమైన వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ, 1984 నాటి కీలక రాజకీయ పరిణామాలను వక్తలు గుర్తు చేసుకున్నారు.ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, పోరాట పటిమతో జీవితంలో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ‘వ్యాపార సంస్కర్త – 2025’ అవార్డు లభించిన సందర్భంగా కేక్ కట్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తలు నల్లూరి శేషయ్య, పి.వి.రమణ మూర్తి, రవి గుత్తా, శ్రీనివాసరావు నార్ల ఆర్థికంగా అండగా నిలిచి సమర్థవంతంగా నిర్వహించారు.
అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ–యూఏఈ కార్యవర్గానికి చెందిన అధ్యక్షులు విశ్వేశ్వరరావు మోతుకూరి, ఉపాధ్యక్షులు నిరంజన్ కాచర్ల, ప్రధాన కార్యదర్శి వాసు పొడిపి రెడ్డి, ట్రెజరర్ రాజా రవి కిరణ్ కోడి, సోషల్ మీడియా ఇన్చార్జ్ హరి కల్లూరి, మీడియా కోఆర్డినేటర్ ప్రసాద్ దారపనేని, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు ఖాదర్ బాషా షేక్, సింగయ్య రామినేని, సురేంద్ర బెజవాడ, మధుసూధన్ తాళ్లూరి, మోహన్ మురళి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.





తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







