‘బ్యాడ్ గాళ్స్’ ట్రైలర్ రిలీజ్..
- December 23, 2025
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘బ్యాడ్ గాళ్స్’. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మాణంలో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ఫేమ్ డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ అవ్వగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ రాజాసాబ్ దర్శకుడు మారుతి చేతుల మేడేనుగా రిలీజ్ చేసారు. మీరు కూడా బ్యాడ్ గాళ్స్ ట్రైలర్ చూసేయండి.
ట్రైలర్ రిలీజ్ అనంతరం మారుతి మాట్లాడుతూ.. డైరెక్టర్ ఫణి ప్రదీప్ నా చిరకాల మిత్రుడు. సాధు జీవి, మంచి సంగీత జ్ఞానం ఉన్నవాడు. తన మొదటి సినిమాలో నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు బ్యాడ్ గాళ్స్చి సినిమా అంతే పెద్ద హిట్ అవుతుంది. ఒక ఐదుగురు కొత్త అమ్మాయిలతో ఒక మంచి విషయం చెప్పే సినిమా చేసాడు. ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







