భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు

- December 23, 2025 , by Maagulf
భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు

న్యూ ఢిల్లీ: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణంలో టాటా మోటార్స్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2.5 లక్షలకు పైగా టాటా ఎలక్ట్రిక్ కార్లు రోడ్లపై ప్రయాణిస్తున్నాయి. ఇది భారత్‌ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన రంగంలో టాటా మోటార్స్‌కు ఉన్న బలమైన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రయోగాత్మక పరిష్కారంగా చూసిన వినియోగదారులు, ఇప్పుడు వాటిని ప్రధాన రవాణా ఎంపికగా స్వీకరిస్తున్నారు. ఈ మార్పుకు టాటా మోటార్స్ ప్రధాన కారణంగా నిలిచింది. 2020లో నెక్సాన్.evను దేశంలో తొలి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కారుగా ప్రవేశపెట్టిన టాటా, ఆ తర్వాత ఈవీ విభాగంలో వేగంగా తన ఉనికిని విస్తరించింది. నెక్సాన్.ev లక్షకు పైగా యూనిట్ల అమ్మకాలతో భారత ఈవీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.

ప్రస్తుతం దేశంలో అమ్ముడయ్యే(Tata Motors) ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లలో సుమారు 66 శాతం వాటా టాటా మోటార్స్‌దే. అంటే భారత్‌ రోడ్లపై కనిపించే మూడు ఈవీల్లో రెండూ టాటా బ్రాండ్‌కే చెందినవని చెప్పవచ్చు. టియాగో.ev (Tata Tiago EV), పంచ్.ev, నెక్సాన్.ev, కర్వ్.ev, హారియర్.ev వంటి మోడళ్లతో అన్ని ధరల శ్రేణుల్లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా టాటా వాహనాలను అందిస్తోంది. ట్రావెల్ ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా XPRES-T EVను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విజయంపై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ అండ్ సీఈఓ శైలేశ్ చంద్ర స్పందిస్తూ, ఇది కేవలం అమ్మకాల గణాంకాల విజయం మాత్రమే కాదని, భారత్‌లో స్వచ్ఛమైన, స్థిరమైన మొబిలిటీ వైపు జరిగిన మార్పుకు నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, మెరుగైన చార్జింగ్ మౌలిక వసతులు, వినియోగదారుల విశ్వాసం కలిసి ఈ ప్రయాణాన్ని విజయవంతం చేశాయని ఆయన పేర్కొన్నారు. చార్జింగ్ సదుపాయాల విస్తరణలో కూడా టాటా మోటార్స్ ముందంజలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా చార్జింగ్ పాయింట్లకు వినియోగదారులకు యాక్సెస్ కల్పిస్తోంది. ప్రధాన రహదారులు, నగరాల్లో ఇప్పటికే 100 మెగా ఫాస్ట్ ఛార్జింగ్ హబ్‌లు సేవలు అందిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com