సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకకు హాజరైన రామ్ చరణ్
- December 29, 2025
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. స్టార్లతో నిండిన ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరుకావడం ఈవెంట్ ని మరింత స్పెషల్ గా మార్చింది.
రామ్ చరణ్ సింపుల్, క్లాసీ లుక్‌లో అదరగొట్టారు.సాఫ్ట్ కలర్స్‌తో కూడిన క్లిన్ అవుట్‌ఫిట్‌లో నేచురల్ స్టైల్‌తో అలరించారు. ఆయన స్టైల్, స్వాగ్ హైలైట్‌గా నిలిచాయి.
ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, ఎంఎస్ ధోనీ, బాబీ డియోల్ కలిసి దిగిన ఫోటో. సినిమా, క్రికెట్ ప్రపంచాలకు చెందిన దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో సహజంగా నవ్వుతూ కనిపించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది.
రామ్ చరణ్ – సల్మాన్ ఖాన్ల మధ్య ఉన్న స్నేహబంధం ఈ వేడుకలో స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం వృత్తిపరమైన పరిచయమే కాదు, అంతకంటే లోతైన అనుబంధమని ఈ మూమెంట్స్ చాటి చెప్పాయి. మెగా ఫ్యామిలీతో సల్మాన్‌కు ఉన్న సన్నిహిత సంబంధం, చరణ్ ప్రజెన్స్ ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చింది.
రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







