అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- December 29, 2025
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చానన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. లాబీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రతి సభ్యుడిని మేము గౌరవిస్తాం. ఈ రోజే కాదు.. ఆసుపత్రిలో కూడా కేసీఆర్‌ను కలిశాను. మేము ఇద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతాం. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించాను.
కేసీఆర్ వెంటనే ఎందుకు వెళ్లారన్న విషయాన్ని ఆయననే అడగాలి. పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరి ఇక్కడ సెంట్రల్ హాల్ ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ యాక్సెస్ ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేలకు కూడా సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం” అని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







