‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మాస్ సాంగ్ రిలీజ్!
- December 30, 2025
సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు తెచ్చేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక పవర్ఫుల్ అతిథి పాత్రలో నటిస్తుండటం విశేషం.ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ఆర్ యూ రెడీ అనే మాస్ పాటను విడుదల చేసింది.
ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.ఏంటి బాసూ సంగతీ అదిరిపోద్దీ సంక్రాంతీ, ఏంటి వెంకీ సంగతీ ఇరగతీద్దాం సంక్రాంతీ అంటూ లైన్లు అభిమానుల చేత ఈలలు వేయిస్తున్నాయి. చిరంజీవి సిగ్నేచర్ స్టెప్పులతో గ్రేస్‌ను చూపిస్తుంటే, వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్ మేనరిజమ్స్‌తో పాటలో జోష్ నింపారు. పాట చిత్రీకరణలో అనిల్ రావిపూడి తనదైన కలర్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ మార్క్‌ను చూపించారు. మెగాస్టార్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. వెంకటేష్ తోడవ్వడంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులకు కూడా ఫుల్ మీల్స్ లాంటి విందు అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







