OTT లో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్!
- December 30, 2025
హారర్ థ్రిల్లర్ సిరీస్ ల పట్ల ఓటీటీ (OTT) ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక యథార్థ సంఘటనలు ఆధారంగా అంటే ఆ సిరీస్ పై ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా అమెజాన్ ఎం ఎక్స్ ప్లేయర్ కి వచ్చిన ఒక హిందీ వెబ్ సిరీస్ ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఆ సిరీస్ పేరే భయ్ ది గౌరవ్ తివారీ మిస్టరీ. ఇది పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ గా పేరుపొందిన గౌరవ్ తివారీ జీవితానికి సంబంధించిన కథ. రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించగా, కరణ్ టాకర్ ప్రధానమైన పాత్రను పోషించాడు.
‘పాట్నా’కు చెందిన గౌరవ్ తివారీ పైలట్ గా పని చేస్తూ ఉంటాడు. ఒకానొక సంఘటన కారణంగా ఆయన దృష్టి దెయ్యాలు భూతాల దిశగా వెళుతుంది.దాంతో వాటికి సంబంధించిన పరిశోధనలు చేస్తూ ముందుకు వెళతాడు. పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ గా ఆయన ఎన్నో సమస్యలను పరిష్కరిస్తాడు. అలాంటి ఆయన ఊహించని విధంగా తన 32వ ఏట మరణిస్తాడు. ఆయన మరణం కూడా ఒక మిస్టరీగా మారిపోతుంది. 8 ఎపిసోడ్స్ తో కూడిన ఈ సిరీస్ కూడా ఆయన మరణంతోనే మొదలవుతుంది. గౌరవ్ తివారీకి దెయ్యాల పట్ల ఎలా ఆసక్తి కలిగింది? ఆయనకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆయన చనిపోవడానికి ముందు ఏం జరిగింది? అనే అంశాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అక్కడక్కడా పలకరించే కొన్ని హారర్ సీన్స్ ను చూడాలంటే కాస్త గుండె ధైర్యం కావలసిందే. త్వరలోనే ఈ సిరీస్ కి తెలుగు ఆడియోను కూడా జోడించే అవకాశం ఉందనే చెప్పాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







