నగర వాసులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- January 04, 2026
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగకు స్వస్థలాలకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ భద్రత అంశాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా నగరాన్ని విడిచి వెళ్లే కుటుంబాలు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
స్వస్థలాలకు వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్ లేదా బీట్ ఆఫీసర్‌కు తెలియజేయాలని సీపీ సజ్జనార్ సూచించారు. ప్రయాణ సమయంలో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని, వాటిని బ్యాంకు లాకర్లలో లేదా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలని ఆయన తెలిపారు. దొంగతనాల నివారణకు, నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







