సందర్శకులను అబ్బురపరుస్తున్న మస్కట్ నైట్స్..!!
- January 07, 2026
మస్కట్: మస్కట్ నైట్స్ 2026 ఈవెంట్‌లలో భాగంగా మస్కట్ మునిసిపాలిటీ లైటింగ్ ఫెస్టివల్ మరియు డ్రోన్ షోలతో సహా అనేక రకాల కార్యకలాపాలు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మస్కట్ గవర్నరేట్ అంతటా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని అధికారయంత్రాంగం తెలిపింది. ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ అంతర్జాతీయ కళాకారులు మస్కట్ నైట్స్ సర్కస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్‌సైకిల్ స్టంట్ షోలు, విన్యాసాలు, వైమానిక ప్రదర్శనలు మరియు అధునాతన 3D హోలోగ్రామ్ టెక్నాలజీ డిస్‌ప్లేలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.లిటిల్ వరల్డ్ ఈవెంట్ పిల్లలకు వ్యోమగామి అనుభవాన్ని అందిస్తుంది. వీటితోపాటు ఖురుమ్ నేచురల్ పార్క్ జనవరి 31 వరకు ఇంటరాక్టివ్ క్యాండీ ల్యాండ్ అనుభవాన్ని నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







