కువైట్ లో 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష..!!
- January 07, 2026
కువైట్ః కువైట్ లో ఉల్లంఘనలకు పాల్పడుతూ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష విధించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిసెంబర్ 22 నుండి 28 తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపినందుకు 45 మంది డ్రైవర్లను ట్రాఫిక్ జైలుకు రిఫర్ చేయగా, 19 మంది బాలనేరస్థులను జువెనైల్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్టు ట్రాఫిక్ వ్యవహారాలు మరియు కార్యకలాపాల విభాగ అధిపతి బ్రిగేడియర్ అబ్దుల్లా అల్-అతీ తెలిపారు. మొత్తం 19,362 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని, 254 వాహనాలు మరియు 15 మోటార్ సైకిళ్లను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.
అలాగే,గడువు ముగిసిన నివాస అనుమతులు ఉన్న 11 మంది వ్యక్తులను అరెస్టు చేయగా, నలుగురు వ్యక్తులను జనరల్ డైరెక్టరేట్ ఫర్ డ్రగ్ కంట్రోల్‌కు రిఫర్ చేసినట్టు వెల్లడించారు. పరారీ కేసులు లేదా అరెస్ట్ వారెంట్లు చెల్లించని 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!
- నార్త్ బతినాలో ప్రవాసి హత్య..నిందితుడు అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో అక్రమ స్ట్రీట్ రేసింగ్.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- జెడ్డాలో 9వేలమందికి హౌజింగ్ యూనిట్లు కేటాయింపు..!!
- కువైట్ లో జనవరి 9న నీటి సరఫరాకు అంతరాయం..!!
- యూఏఈలో పలు నెస్లే ఉత్పత్తుల రీకాల్..!!
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!







