సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- January 10, 2026
హైదరాబాద్: తెలంగాణలో సినిమా టిక్కెట్ ధరల పెంపు అంశంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.. సినిమా టిక్కెట్ ధరల పెంపునకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. పుష్ప-2 తర్వాత ఎప్పుడూ ధరల పెంపునకు అనుమతి ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా టిక్కెట్ ధరల పెంపు అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను సినిమా పరిశ్రమ వ్యవహారాలను పట్టించుకోవడం మానివేశానని ఆయన అన్నారు. టిక్కెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అర్ధరాత్రి సమయంలో జీవో వచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై విధంగా స్పందించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







